సుమారు మూడు నెలల కిందట ఏపీలో సంచలనం సృష్టించిన విశాఖ చిన్నారి జ్ఞానస హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా ఏడాదిన్నర వయస్సున్న కూతురిని హత్య చేసిన కేసులో నిందితురాలిగా ఉన్న ఆమె తల్లి కుసుమలత(27) ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇటీవల బెయిల్‌పై విడుదలైన కుసుమలత పెందుర్తి పరిధి పురుషోత్తమపురంలోని పుట్టింట్లో ఉంటోంది.గత నెల 27న ఆమె ఇంట్లో ఫ్యాన్ కొక్కేనికి ఉరి వేసుకుని ఆత్మహత్యా యత్నం చేసింది. కుటుంబ సభ్యులు గమనించి ఆమెను విశాఖలోని కేజీహెచ్‌కి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కుసుమలత మృతి చెందింది. భర్త, అత్తింటి వరకట్న వేధింపులు తాళలేక తమ కూతురు మరణించిందని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అత్తింటి వేధింపుల కారణంగానే తమ కూతురు చనిపోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
విశాఖ చిన్నారి జ్ఞానస కేసులో షాకింగ్ ట్విస్ట్..