కరోనా భయం: ఎద్దుకు మాస్క్.. రైతుపై నెటిజన్ల ప్రశంసలు

కరోనా భయంతో ప్రపంచం మొత్తం భయపడుతోంది. ఆ మహమ్మారికి వ్యాక్సిన్ లేకపోవడంతో సామాజిక దూరం పాటిస్తూ మాస్క్‌‌, శానిటైజర్లతో జాగ్రత్తలు పాటించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. మనుషులంటే సరే జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. మరి పెంపుడు జంతవుల సంగతేంటనే ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గొర్రెల్లు, మేకలు, ఆవులు, ఎద్దులకు జాగ్రత్తలు తప్పవు. ఇదే ఆలోచన ఓ రైతుకు వచ్చింది.. తన ఎద్దును కాపాడుకునేందుకు దానికి మాస్క్ కట్టాడు.ఏపీలో కరోనా కేసులు అధికంగా ఉన్న కర్నూలు జిల్లాలో ఈ సీన్ కనిపంచింది. ఓ రైతు రోజూ ఒంటెద్దు సాయంతో గడ్డి కోసం వెళుతున్నాడు. జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు ఎక్కువగా ఉండటంతో తన ఎద్దు విషయంలో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఓ టవల్‌‌ను ఆ ఎద్దు ముక్కుకు మాస్క్‌లా చుట్టేశాడు. ఈ వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. నెటిజన్లు రైతుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.


కరోనా భయంతోనే తన ఎద్దుకు ఇలా మాస్క్ కట్టానంటున్నాడు రైతు. రోజూ టీవీ, పేపర్లలో జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారని.. పులికి కరోనా వచ్చిందని తెలిసిందన్నారు. ఆ మహమ్మారి నుంచి తన ఎద్దును కాపాడుకోవడానికి ఇలా జాగ్రత్తలు తీసుకున్నానని చెబుతున్నాడు. తనకు ఆ ఎద్దు కన్న బిడ్డతో సమానం అంటున్నాడు.