మేష రాశి
ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుకుంటారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబసభ్యులు, మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.
వృషభ రాశి
బాధ్యతలు పెరిగినా నమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు పొందుతారు. సన్నిహితులతో అకారణంగా విభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా తప్పనిసరి. కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు అందుకుంటారు. ధనలాభం పొందుతారు. ఆర్ధిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది.
మిథున రాశి
రుణ వత్తిడుల నుంచి విముక్తి చెందుతారు. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. సంఘంలో గౌరవం, పేరు ప్రతిష్ఠలు పొందుతారు. రాజకీయ, కళా, పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు, సత్కారయోగం ఉంది. ఆకస్మిక ధన లాభం పొందుతారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
కర్కాటక రాశి
మిత్రుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతులు, హోదాలు దక్కుతాయి. కొత్త పనులు, కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కాంట్రాక్టులు లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.